ముందస్తు అరెస్టులను ఖండించిన బి ఆర్ ఎస్ వి నాయకులు
నేరేడు చర్ల, డైనమిక్ న్యూస్, మార్చి 25 నేరేడుచర్ల మండలంలో “చలో హైదరాబాద్” కార్యక్రమానికి వెళ్తున్నారనే సమాచారం మేరకు బి ఆర్ ఎస్, బి ఆర్ ఎస్ వీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. నిరసన హక్కును అణచివేస్తున్నారన్న విమర్శ ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ వి హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు, కల్లూరు మాజీ సర్పంచ్ పల్లెపంగు నాగరాజు మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడం అన్యాయమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన హక్కును అణచివేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు ప్రజాపాలన...