విజయానికి శ్రమే మార్గం: జిల్లా ఎస్పీ నరసింహా
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, మార్చి 25 “విజయానికి అడ్డదారులు ఉండవు శ్రమతోనే విజయాన్ని సాధించాలి” అని జిల్లా ఎస్పీ కె. నరసింహా అన్నారు. సూర్యాపేట పట్టణంలోని స్పందన డిగ్రీ, పీజీ కళాశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. లక్ష్య సాధనకు ప్రణాళిక అవసరం విద్యార్థులు విజయాన్ని సాధించాలంటే క్రమశిక్షణతో పాటు మంచి ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ఎంచుకున్న లక్ష్యంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, గొప్ప వ్యక్తుల విజయగాథలను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. యువత తమ భవిష్యత్తుపై స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకొని కష్టపడాలని సూచించారు. యువతకు విలువలపై అవగాహన అవసరం చదువుకునే దశలో చెడు...