సమాచార హక్కు చట్టాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత – మఠంపల్లిలో ఆర్టీఐ రాష్ట్ర ఐదవ మహాసభలు ఘనంగా– రాష్ట్ర నలుమూలల నుంచి కార్యకర్తల హాజరు
డైనమిక్ న్యూస్ మఠంపల్లి, మార్చి 26 సమాచార హక్కు రక్షణ చట్టం-2005 రాష్ట్ర ఐదవ మహాసభలు సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాంపాటి సందీప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆర్టీఐ చట్టం ప్రజలకు బ్రహ్మాస్త్రం ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ శ్యాం ప్రసాద్ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం సామాన్య ప్రజలకు తమ హక్కులను తెలుసుకునే శక్తినిచ్చిందని తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థను ప్రశ్నించడానికి ఇది ఒక శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. గత 21 సంవత్సరాల్లో అనేక ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చేయడంలో ఈ...