హుజూర్‌నగర్‌లో ఘనంగా ధర్మభిక్షం 15వ వర్ధంతి

హుజూర్‌నగర్, మార్చి 26 ,డైనమిక్ న్యూస్ అమరజీవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, గీత పనివారాల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బొమ్మగాని ధర్మభిక్షం 15వ వర్ధంతిని హుజూర్‌నగర్‌లోని కంఠమ మహేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ధర్మభిక్షం సేవలను స్మరించిన నాయకులు ఈ సందర్భంగా తెలంగాణ గీత పనివారాల సంఘం రాష్ట్ర సమితి సభ్యుడు, హుజూర్‌నగర్ నియోజకవర్గ కన్వీనర్ పాలకూరి బాబు మాట్లాడుతూ, అఖిల భారత స్థాయిలో గీత పనివారాల సంఘాన్ని ఏర్పాటు చేసి లక్షలాది గీత కార్మికులను ఏకం చేసి వారి హక్కుల సాధనలో ధర్మభిక్షం కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. గీత కార్మికుల హక్కుల కోసం పోరాటానికి...