చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధిలో ‘అరైవ్–అలైవ్’ అవగాహన కార్యక్రమంవిద్యార్థులకు రోడ్డు భద్రత, సైబర్ జాగ్రత్తలపై ఎస్పీ నరసింహ సూచనలు
సూర్యాపేట బ్యూరో, మార్చి 26, డైనమిక్ న్యూస్ సూర్యాపేట జిల్లా చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధిలోని దురాజుపల్లి గ్రామంలోని ఎం.ఎస్.ఆర్ సెంట్రల్ స్కూల్‌లో గురువారం ‘అరైవ్–అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉన్నత లక్ష్యాలు ఎంచుకుంటేనే విజయం విద్యార్థులు ఉజ్వలమైన, ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకుని ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే మంచి విజయాలు సాధించవచ్చని ఎస్పీ తెలిపారు. పాఠశాలలను దేవాలయాలుగా, తరగతి గదులను ప్రయోగశాలలుగా భావించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెంపొందించుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతపై అవగాహన అవసరం...