వేసవి సాగుపై రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు నీటి, ఎరువుల యాజమాన్యం పాటించాలి – దిగుబడి పెంపు లక్ష్యం

నేరేడు చర్ల, మార్చి 31, డైనమిక్ న్యూస్ వేసవి కాలంలో పంటల సంరక్షణకు రైతులు సరైన పద్ధతులు అనుసరించాలని వ్యవసాయ శాఖ సూచించింది. నీటి వినియోగం, ఎరువుల వాడకం, చీడపీడల నియంత్రణలో జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడులు సాధ్యమవుతాయని అధికారులు తెలిపారు. నీటి యాజమాన్యం కీలకం పంటలకు నీరు ఇవ్వేటప్పుడు సమయపాలన చాలా ముఖ్యమని తెలిపారు. ఉదయం 10 గంటలలోపు లేదా సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే తడులు ఇవ్వాలని సూచించారు. మట్టి పగుళ్లు రాకముందే మళ్లీ నీరు పెట్టడం ద్వారా పంట ఆరోగ్యం కాపాడుకోవచ్చన్నారు. కోతకు వారం నుంచి పది రోజుల ముందు పూర్తిగా నీటిని నిలిపివేయాలని తెలిపారు. ఎరువుల వినియోగంలో జాగ్రత్తలు...