కారంపూడిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మాచర్ల నియోజకవర్గ మహాసభ
కారంపూడి, మార్చి 31, డైనమిక్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మాచర్ల నియోజకవర్గ మహాసభ సోమవారం కారంపూడిలో ఘనంగా నిర్వహించబడింది. సమావేశానికి సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్, రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము, సిపిఐ మాచర్ల ఏరియా కార్యదర్శి మేకపోతు శ్రీనివాస్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. నూతన కమిటీ ఎన్నిక ఈ మహాసభలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మాచర్ల నియోజకవర్గ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏరియా కార్యదర్శిగా మేకపోతు చిన్నకోటిరెడ్డి నియోజకవర్గ అధ్యక్షుడిగా గాలం శ్రీనివాసరావు లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ సభ్యుల ఎంపిక కమిటీ సభ్యులుగా చేపూరి వీరబ్రహ్మచారి, సిహెచ్...