నేరేడుచర్లలో ట్రాక్టర్ ట్రాలీలకు రేడియం స్టిక్కర్లురోడ్డు భద్రతపై ఎస్‌ఐ రవీందర్ అవగాహన

డైనమిక్ న్యూస్, నేరేడుచర్ల, ఏప్రిల్ 3 రాత్రిపూట ట్రాక్టర్ ట్రాలీలకు నెంబర్ ప్లేట్లు, రేడియం స్టిక్కర్లు లేకుండా ప్రయాణించడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని నేరేడుచర్ల ఎస్‌ఐ రవీందర్ తెలిపారు. శుక్రవారం రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. మైకులు ఏర్పాటు ప్రమాదకరం ట్రాక్టర్లపై మైకులు ఏర్పాటు చేయడం వల్ల డ్రైవర్ల దృష్టి మరలిపోయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎస్‌ఐ హెచ్చరించారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని అలాంటి చర్యలను నివారించాలని కోరారు. బైపాస్ మార్గాల వినియోగానికి సూచనలు హుజూర్‌నగర్, గరిడేపల్లి, పొనుగోడు ప్రాంతాల నుంచి వచ్చే ట్రాక్టర్లు శివాలయం బైపాస్ రోడ్డును ఉపయోగించి, గంగమ్మ తల్లి ఎదురు...