ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ నరసింహ
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, ఏప్రిల్ 9 జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపర్చేందుకు చేపడుతున్న చర్యలను జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించారు. గురువారం సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాట్ల పనులను సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు నియమాలను కచ్చితంగా పాటించాలని ఎస్పీ సూచించారు. ట్రాఫిక్ పోలీసుల ద్వారా ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ట్రాఫిక్ రద్దీపై ప్రత్యేక దృష్టి రోజురోజుకు పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పునర్వ్యవస్థీకరణ, నియంత్రణ చర్యలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నామని తెలిపారు. బస్టాండ్ పరిసరాల్లో రద్దీ పరిస్థితులను, రోడ్ల వెంట...