బూరుగడ్డ గ్రామంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా
హుజూర్ నగర్, ఏప్రిల్ 14 ,శుభోదయ డైనమిక్ బూరుగడ్డ గ్రామపంచాయతీలో భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ యరగాని రాధ నాగరాజు, ఉప సర్పంచ్ గడ్డం నాగయ్య ఆధ్వర్యంలో జరిగింది. అంబేద్కర్ ఆశయాలు భావితరాలకు చేరవేయాలి ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శ పురుషుడని, సమాజానికి స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అపారమని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలు, లక్ష్యాలను భావితరాలకు చేరవేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. విస్తృతంగా పాల్గొన్న గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో వార్డు...