లాల్ లక్ష్మీపురం గ్రామ పంచాయతీకి ప్రత్యేక కార్యదర్శి అవసరం గ్రామ ప్రజల డిమాండ్ – పరిపాలనలో ఇబ్బందులు లేకుండా చూడాలి
నేరేడు చర్ల, ఏప్రిల్ 16,శుభోదయ డైనమిక్ వార్త నేరేడు చర్ల మండల పరిధిలోని లాల్ లక్ష్మీపురం గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా కార్యదర్శిని నియమించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి గ్రామ పంచాయతీకి ఒకే కార్యదర్శి పనిచేస్తుండడంతో పరిపాలనలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. ఉమ్మడి వ్యవస్థ వల్ల సమస్యలు గ్రామ పంచాయతీ విభజన జరిగినప్పటికీ, కార్యదర్శి మాత్రం కల్లూరు , లాల్ లక్ష్మీపురం గ్రామాల కు ఉమ్మడిగానే కొనసాగుతున్నారని ప్రజలు పేర్కొన్నారు. ఒకే కార్యదర్శి రెండు గ్రామాల బాధ్యతలు నిర్వర్తించాల్సి రావడంతో సేవలు ఆలస్యమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పుట్టిన, మరణ ధృవపత్రాలు, పన్నుల వసూళ్లు, అభివృద్ధి పనుల...