టేక్మాల్‌లో అక్రమ ఇటుక బట్టీల దందా వాల్టా చట్టానికి తూట్లు – అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
టేక్మాల్, ఏప్రిల్ 19 ,శుభోదయం డైనమిక్ చట్టాలు కఠినంగా అమల్లో ఉన్నాయని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో అక్రమ ఇటుక బట్టీలు విస్తరిస్తూ పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయి. టేక్మాల్, సర్మన్‌కుంట తాండ గ్రామ పంచాయతీల శివారులో ఎలాంటి అనుమతులు లేకుండానే ఇటుక బట్టీలు యథేచ్ఛగా నడుస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు బేఖాతరు – అనుమతుల్లేకే బట్టీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇటుక బట్టీల స్థాపనకు పర్యావరణ, పంచాయతీరాజ్, మైనింగ్, రెవెన్యూ, అటవీ, విద్యుత్ శాఖల అనుమతులు తప్పనిసరి. అయితే టేక్మాల్ పరిసరాల్లో నడుస్తున్న బట్టీలకు ఇలాంటి అనుమతులు లేవని తెలుస్తోంది....