తాటిచెట్టు నుంచి జారి గాయపడిన గీత కార్మికుడు
హుజూర్ నగర్, ఏప్రిల్ 20,శుభోదయ డైనమిక్ హుజూర్ నగర్ గ్రామంలోని లింగగిరి రోడ్డులో సోమవారం జరిగిన ప్రమాదంలో గీత కార్మికుడు ఓరుగంటి సత్యం గాయపడ్డాడు. రోజువారీ పనిలో భాగంగా తాటిచెట్టు ఎక్కిన సత్యం, దిగుతూ ఉండగా మోకు జారి కింద పడిపోయాడు. తక్షణ చికిత్సకు తరలింపు అక్కడే ఉన్న తోటి గీత కార్మికులు వెంటనే స్పందించి సత్యంను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆయన ఎడమ మడమ విరిగినట్లు నిర్ధారించారు. పరామర్శించిన సొసైటీ అధ్యక్షుడు గాయపడిన సత్యంను సొసైటీ అధ్యక్షుడు వల్లపుదాసు కృష్ణ గౌడ్ పరామర్శించారు. ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా అందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు. పరామర్శలో పాల్గొన్న వారు...