దేవరకొండలో SBI-ACB బ్రాంచ్‌లో భారీ మోసం ఛేదనరూ.2.42 కోట్లు స్వాధీనం – నలుగురు నిందితుల అరెస్ట్
నల్లగొండ బ్యూరో, ఏప్రిల్ 21,శుభోదయ డైనమిక్ నల్లగొండ జిల్లా పరిధిలోని దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ACB బ్రాంచ్‌లో జరిగిన భారీ ఆర్థిక మోసం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి, రూ.2,42,10,000 నగదు, 6 స్మార్ట్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఇనాక్టివ్ ఖాతాలపై కన్నేసిన నిందితులు ఏప్రిల్ 13న బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాంట్రాక్ట్ హౌస్‌కీపింగ్ ఉద్యోగి లెండల చక్రపాణి బ్యాంక్‌లోని ఇనాక్టివ్ ఖాతాల వివరాలను దుర్వినియోగం చేసి, అక్రమంగా KYC అప్డేట్...