జనగణన–2027: స్వీయ గణనకు శ్రీకారంపట్టణ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ సూచనలు

నేరేడుచర్ల, ఏప్రిల్ 26,శుభోదయ డైనమిక్ వార్త భారత జనగణన–2027లో భాగంగా స్వీయ గణన (Self Enumeration) ప్రక్రియను ప్రారంభించినట్లు ఆదివారం నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు తెలిపారు. పట్టణ ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు అవకాశం స్వీయ గణన ప్రక్రియ ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు కొనసాగనుంది. ఈ కాలంలో ప్రజలు ఆన్‌లైన్ ద్వారా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చు. దీంతో గణన ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు సమయం ఆదా అవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారా సులభ...