నేరేడుచర్లలో “బడిబాట” అవగాహన ర్యాలీసంక్షేమ వారోత్సవాల ముగింపు సందర్భంగా కార్యక్రమం

నేరేడుచర్ల, ఏప్రిల్ 26,శుభోదయ డైనమిక్ వార్త “ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సంక్షేమ వారోత్సవాల ముగింపు సందర్భంగా ప్రొ. జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నేరేడుచర్లలో ఘనంగా నిర్వహించారు.స్థానిక ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలుర వసతిగృహాల వార్డెన్ల సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టారు. పిఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నుండి విద్యార్థులతో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులకు కరపత్రాలు పంపిణీ చేసి విద్యపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు: మునిసిపల్ చైర్మన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మునిసిపల్ చైర్మన్ కొణతం వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అవసరమైన...