సూర్యాపేటలో హత్య కేసు తీర్పు అత్త హత్య కేసులో కోడలికి జీవిత ఖైదు
సూర్యాపేట బ్యూరో, శుభోదయ డైనమిక్,ఏప్రిల్ 28 ఆస్తి వివాదం కారణంగా అత్తను హత్య చేసిన కేసులో నిందితురాలికి సూర్యాపేట జిల్లా కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిద్రిస్తున్న సమయంలో దారుణ హత్య 2020 ఆగస్టు 29న ఆత్మకూరు మండలం రామోజీ తండాకు చెందిన 75 ఏళ్ల గుగులోతు మీరి నిద్రిస్తున్న సమయంలో, ఆమె కోడలు గుగులోతు కీరి (55) ఇనుప రాడ్‌తో తలపై దాడి చేసి హత్య చేసినట్లు కేసు నమోదు అయింది. పోలీసుల దర్యాప్తు – కోర్టులో చార్జ్‌షీట్ మృతురాలి కుమార్తె బానోతు ముత్యాలి ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు హత్య కేసు...