హుజూర్‌నగర్‌లో నూతన వ్యాపారానికి శ్రీకారంకౌన్సిలర్ వల్లపుదాసు కృష్ణ చేతుల మీదుగా రిబ్బన్ కట్టింగ్

హుజూర్‌నగర్, మే 4 ,శుభోదయం డైనమిక్ హుజూర్‌నగర్ పట్టణంలోని మెయిన్ రోడ్డులో “వారాహి ప్లేట్స్ అండ్ డిస్పోజబుల్ & ఫ్రోజెన్ ఫుడ్స్” పేరుతో నూతనంగా ఏర్పాటు చేసిన షాపును 19వ వార్డు కౌన్సిలర్ వల్లపుదాసు కృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. యువ మహిళల కొత్త వ్యాపార ప్రారంభం దాసరి శ్రీనివాస్ కుమార్తె లక్ష్మీ నందన, పిల్లట్ల రేణుక కలిసి ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తూ యువత ముందుకు రావడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్ష ఈ సందర్భంగా కౌన్సిలర్ వల్లపుదాసు కృష్ణ మాట్లాడుతూ, వ్యాపారం రోజురోజుకు అభివృద్ధి చెందాలని, మంచి లాభాలు సాధించాలని ఆకాంక్షించారు....