పిపిసి కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట బ్యూరో, శుభోదయ డైనమిక్, మే 4 పిపిసి కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హమాలి, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు వాకాటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సూర్యాపేట కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోళ్ల స్థితి రాష్ట్రవ్యాప్తంగా పిపిసి కేంద్రాలకు 21.34...