లాల్ లక్ష్మీపురంలో అక్రమ వసూళ్ల ఆరోపణలు – పంచాయతీ కార్యదర్శిపై గ్రామస్తుల ఆగ్రహం
నేరేడు చర్ల , మే 5,శుభోదయ డైనమిక్ వార్త నేరేడు చర్ల మండల పరిధిలోని లాల్ లక్ష్మీపురం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి పై భారీ స్థాయిలో అక్రమ వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గ్రామంలోని ప్రజలు ఎక్కువగా దళితులు, చిన్న మరియు సన్నకారు రైతులు కావడంతో వారి అవసరాలను ఆసరాగా తీసుకుని డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆర్థిక బలహీనతలే లక్ష్యమా? సుమారు 450 ఓట్ల జనాభా కలిగిన ఈ గ్రామంలో నివసించే ప్రజలు ప్రధానంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారు. ఇల్లు లేదా వ్యవసాయ అవసరాల కోసం బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకోవాలనుకునే వారి పరిస్థితిని ఉపయోగించుకుని కార్యదర్శి...