సూర్యాపేట జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా గుండు రామాంజి గౌడ్ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఆశాదీప్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం
శుభోదయ డైనమిక్ న్యూస్, హుజూర్‌నగర్, మే 11 సూర్యాపేట జిల్లా సర్పంచుల ఫోరం నూతన అధ్యక్షుడిగా గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామ సర్పంచ్ గుండు రామాంజి గౌడ్ సోమవారం నియమితులయ్యారు. రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాయితి ఆశాదీప్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గల నాయకుడిగా గుర్తింపు గుండు రామాంజి గౌడ్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా గుర్తింపు పొందారు. గరిడేపల్లి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్‌గా వివిధ...