లింగగిరిలో గుప్త నిధుల కలకలం వీరన్న స్వామి పురాతన విగ్రహం వద్ద తవ్వకాలు ఆలయ చరిత్ర వెలుగులోకి తేవాలని గ్రామస్థుల విజ్ఞప్తి
శుభోదయ డైనమిక్ న్యూస్, హుజూర్‌నగర్, మే 11 హుజూర్‌నగర్ మండలం లింగగిరి గ్రామంలో గుప్త నిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు నిర్వహించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామ శివారులోని పెద్ద గట్టు సమీపంలో ఉన్న పురాతన వీరన్న స్వామి రాతి విగ్రహాన్ని పక్కకు జరిపి సుమారు ఐదు అడుగుల లోతులో గుంత తవ్విన ఆనవాళ్లు కనిపించాయి. రాత్రికి రాత్రే తవ్వకాలు స్థానికుల వివరాల ప్రకారం, దుండగులు రాత్రి సమయంలో ఎవరికి తెలియకుండా తవ్వకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. పురాతన విగ్రహాలు, ఆలయాల సమీపంలో గుప్త నిధులు ఉంటాయనే మూఢనమ్మకంతో ఈ చర్యలకు పాల్పడినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో గ్రామ ప్రజలు పురాతన...