ఆర్లగూడెం శివారులో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి నలుగురు అరెస్ట్.. రూ.6500 నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం

శుభోదయం డైనమిక్ వార్త, చిలుకూరు, మే 13 చిలుకూరు మండలం ఆర్లగూడెం గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం మెరుపు దాడి నిర్వహించారు. నమ్మదగిన సమాచారంతో చేపట్టిన ఈ రైడ్‌లో పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు అక్కడి నుంచి పరారైనట్లు అధికారులు వెల్లడించారు. నగదు, మొబైల్ ఫోన్లు సీజ్ అరెస్టు చేసిన వారి వద్ద నుంచి సుమారు రూ.6,500 నగదు తో పాటు నాలుగు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. చిలుకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు ఈ ఘటనపై చిలుకూరు పోలీస్ స్టేషన్‌లో...