సూర్యాపేటలో ఘనంగా జిల్లాస్థాయి విద్యా విజయోత్సవం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేసిన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 10 శాతం అడ్మిషన్లు పెంచాలని లక్ష్యం
సూర్యాపేట బ్యూరో, మే 17 శుభోదయ డైనమిక్ వార్త తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాస్థాయి విద్యా విజయోత్సవం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సత్కారం పదో తరగతి, ఇంటర్మీడియట్ మరియు క్రీడా విభాగాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు....