వ్యవసాయ బావిలో పడి మహిళ మృతి కమలానగర్ శివారులో విషాద ఘటన

నేరేడుచర్ల,శుభోదయ డైనమిక్ వార్త, మే 19 నేరేడుచర్ల మండలం కమలానగర్ గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన నక్క భాగ్యలక్ష్మి (27) వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. గొర్రెలు మేపుతున్న సమయంలో ప్రమాదం భాగ్యలక్ష్మి తన భర్త మొగిలయ్యతో కలిసి నెల రోజులుగా కమలానగర్ పరిసర ప్రాంతాల్లో గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తోంది. సోమవారం మధ్యాహ్నం గొర్రెలు మేపుతున్న సమయంలో పోరెడ్డి వెంకటనారాయణ రెడ్డి వ్యవసాయ బావి వద్ద నీటి కోసం వెళ్లిన ఆమె ప్రమాదవశాత్తు జారి బావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన పోలీసులు ఘటనను గమనించిన భర్త మొగిలయ్య వెంటనే...