నూతన ఎస్సై సైదిరెడ్డికి బీఆర్ఎస్ నాయకుల ఘన సన్మానం పోలీస్ స్టేషన్‌లో మర్యాదపూర్వక భేటీ

నేరేడుచర్ల, మే 19,శుభోదయ డైనమిక్ వార్త నేరేడుచర్ల మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సైదిరెడ్డిని హుజూర్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు ఘనంగా సన్మానించారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సైదిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలి ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మండల ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేయాలని కోరారు. ముఖ్యంగా మద్యం, బెట్టింగ్‌లు వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంత యువతకు పోలీస్ శాఖ వారధిగా నిలిచి ప్రజల రక్షణకు...