యాదాద్రిలో రూ.99.55 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన వేద పాఠశాల, నిత్య కల్యాణ మండపం, దీక్షాపరుల సదనానికి శ్రీకారం

శుభోదయ డైనమిక్ డెస్క్, మే 23, హైదరాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో రూ.99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. వేద మంత్రోచ్చారణల మధ్య కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పర్యవేక్షణలో వేద పాఠశాలకు భూమిపూజ నిర్వహించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.43.79 కోట్లతో వేద పాఠశాల, రూ.9.86 కోట్లతో కొండపై స్వామివారి నిత్య కల్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు,...