రాయని గూడెంలో మహిళా సంఘాల నూతన భవనానికి శంకుస్థాపన గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు భవనం దోహదం చేస్తుంది : సర్పంచ్ గుండు రామాంజి గౌడ్
శుభోదయ డైనమిక్ , మే 26,హుజూర్‌నగర్ గరిడేపల్లి మండలం రాయని గూడెం గ్రామంలో మహిళా సంఘాల సంఘబంధం రెండవ నూతన భవనానికి గ్రామ సర్పంచ్, సూర్యాపేట జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గుండు రామాంజి గౌడ్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళల అభివృద్ధికి సంఘబంధం భవనాలు ఉపయోగకరం ఈ సందర్భంగా సర్పంచ్ గుండు రామాంజి గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతకు సంఘబంధం భవనాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. మహిళలు పొదుపు సంఘాల ద్వారా రుణాలు పొందుతూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అలాగే తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకులకు సహకరించాలని కోరారు. పలువురు ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యుల...