వరి కొయ్యలు కాల్చొద్దు.. పర్యావరణాన్ని కాపాడండిరైతులకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ విజ్ఞప్తికొయ్యలు తగలబెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక
సూర్యాపేట బ్యూరో, మే 30 శుభోదయ డైనమిక్ వార్త వరి పంట కోత అనంతరం పొలాల్లో మిగిలే వరి కొయ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ తగలబెట్టవద్దని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ రైతులకు విజ్ఞప్తి చేశారు. శనివారం సూర్యాపేట మండలం కాసారాబాద్ గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. నరసింహతో కలిసి ఆయన పాల్గొన్నారు. భూమి సారానికి ముప్పు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరి కొయ్యలను కాల్చడం వల్ల భూమి సారవంతత దెబ్బతింటుందని, నేలలోని సూక్ష్మజీవులు నశించి పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందన్నారు. భూమి సాంద్రత పెరగడంతో అధిక ఎరువులు వాడాల్సి వచ్చి రైతులపై అదనపు ఆర్థిక భారం...