వరి కొయ్యకాళ్లు కాల్చొద్దు.. నేల సారాన్ని కాపాడండి రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ శాఖ అధికారులు
నేరేడుచర్ల, మే 30,శుభోదయ డైనమిక్ వార్త నేరేడుచర్ల మండలంలోని సోమవారం గ్రామంలో శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వరి కోత అనంతరం రైతులు వరి కొయ్యకాళ్లు, ఇతర పంట వ్యర్థాలను కాల్చివేయకుండా భూమిలో కలిపి సేంద్రియ పదార్థాలుగా మార్చుకోవాలని అధికారులు సూచించారు. కొయ్యకాళ్లు కాల్చితే నేల సారం తగ్గుతుంది పంట అవశేషాలను కాల్చివేయడం వల్ల నేలలోని కోట్లాది సూక్ష్మజీవులు, ఇతర జీవరాశులు నశించి భూమి సారవంతత కోల్పోతుందని వ్యవసాయ అధికారులు తెలిపారు. యూరియా, డీఏపీ, పొటాష్ వంటి ఎరువులను మొక్కలకు అందుబాటులోకి తీసుకురావడంలో సూక్ష్మజీవుల పాత్ర కీలకమని, అవి నశిస్తే పంటల దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందన్నారు. సేంద్రియ పదార్థాలుగా...