రోడ్డు భద్రతా వారోత్సవాల్లో అవగాహన సదస్సు అప్రమత్తంగా ఉండండి – సురక్షితంగా ఇంటికి చేరండి" : సీఐ చరమంద రాజు
నేరేడుచర్ల, జూన్ 10,శుభోదయ డైనమిక్ వార్త రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) చరమంద రాజు, ఎస్‌ఐ సైదిరెడ్డి పాల్గొని వాహనదారులకు రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేక పోలీసు బృందాల ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని సీఐ చరమంద రాజు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్...