ప్రజా రక్షణే ధ్యేయం.. సూర్యాపేట జిల్లా పోలీసుల నిరంతర అప్రమత్తత
సూర్యాపేట బ్యూరో , జూన్ 12, శుభోదయ డైనమిక్ వార్త సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా సూర్యాపేట జిల్లా పోలీసులు రాత్రింబవళ్లు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ నరసింహ నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన భద్రతా వ్యవస్థను అమలు చేస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎస్పీ పర్యవేక్షణలో పటిష్ట భద్రత జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు పోలీసు అధికారులు నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్ బృందాల పనితీరును సమీక్షిస్తున్నారు. ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ పోలీసులు సమర్థవంతంగా సేవలందిస్తున్నారు. రాత్రి వేళల్లో విస్తృత గస్తీ జిల్లాలోని ప్రధాన పట్టణాలు, మండల...