భారీ వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ విపత్తులను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలి
సూర్యాపేట బ్యూరో , జూన్ 18, శుభోదయ డైనమిక్ వార్త రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి విపత్తులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. విపత్తు నిర్వహణ, సహాయక చర్యలపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అప్రమత్తత భారీ వర్షాలు, వరదల సమయంలో గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయిలో తహసీల్దార్లు, డీపీఓలు తదితర అధికారులు వెంటనే స్పందించేలా సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో...