గరిడేపల్లి బస్టాండ్ నిరుపయోగం – ప్రయాణికుల కష్టాలకు అధికారుల నిర్లక్ష్యమే కారణమా?
గరిడేపల్లి, శుభోదయ డైనమిక్ ,జూన్ 25 గ్రామం నడిబొడ్డున నిర్మించిన గరిడేపల్లి బస్టాండ్ ప్రయాణికులకు ఉపయోగపడాల్సి ఉండగా, అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బస్టాండ్ భవనం అందుబాటులో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాకపోవడంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు రోడ్డుపైనే బస్సుల కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్య బస్టాండ్ నిర్మాణం పూర్తయి చాలా కాలమైనప్పటికీ దానిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో సంబంధిత శాఖలు విఫలమయ్యాయని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎండ, వర్షంలో ప్రయాణికుల అవస్థలు బస్టాండ్ ఉన్నా ఉపయోగించుకోలేని పరిస్థితి కారణంగా ప్రయాణికులు...