లాల్ లక్ష్మీపురంలో సీసీ రోడ్డుపై మరోసారి సీసీ రోడ్డు..?పంచాయతీ నిధుల దుర్వినియోగానికి కుట్రేనా అంటూ గ్రామస్థుల తీవ్ర ఆరోపణలు ఉన్న సీసీ రోడ్డుపై మట్టి పోసి కొత్త రోడ్డు పనులకు సిద్ధం?
నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త, జూన్ 30 నేరేడు చర్ల మండల పరిధిలోని లాల్ లక్ష్మీపురం గ్రామంలో ఇప్పటికే నిర్మించిన సీసీ రోడ్డుపై మరోసారి సీసీ రోడ్డు వేయడానికి గ్రామ పంచాయతీ అధికారులు సిద్ధమవుతున్నారనే ఆరోపణలు గ్రామంలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం జరుగుతోందని బహిరంగంగా విమర్శిస్తున్నారు. "సీసీ రోడ్డుపై మళ్లీ సీసీ ఎలా వేస్తారు..?" ఇప్పటికే వినియోగంలో ఉన్న సీసీ రోడ్డుపై మరోసారి సీసీ రోడ్డు వేయడానికి ప్రభుత్వం నుంచి ఏదైనా జీవో (GO) లేదా ప్రత్యేక అనుమతి ఉందా అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్నారా...