సూర్యాపేటలో అర్ధరాత్రి నాఖాబందీ 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు – 70కి పైగా వాహనాలు సీజ్
సూర్యాపేట బ్యూరో , జూలై 3,శుభోదయ డైనమిక్ వార్త సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి పోలీసులు భారీ స్థాయిలో అర్ధరాత్రి నాఖాబందీ నిర్వహించారు. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, పట్టణంలోకి వచ్చిపోయే అన్ని మార్గాల్లో మొత్తం 15 ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. 100 మందికి పైగా పోలీసులతో విస్తృత తనిఖీలు జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య పర్యవేక్షణలో ఈ నాఖాబందీ చేపట్టారు. ఈ తనిఖీల్లో 100 మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు....