సూర్యాపేట జిల్లా పోలీస్ వారాంతపు పరేడ్ ఘనంగా నిర్వహణ గౌరవ వందనం స్వీకరించిన జిల్లా ఎస్పీ నరసింహ సిబ్బంది సమస్యలపై పోలీస్ దర్బార్ – త్వరిత పరిష్కారానికి హామీ ప్రజలకు భరోసా కల్పించేలా సేవలు అందించాలని ఎస్పీ సూచన

సూర్యాపేట బ్యూరో , జూలై 4,శుభోదయ డైనమిక్ వార్త సూర్యాపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రతి శనివారం నిర్వహించే వారాంతపు పోలీస్ పరేడ్ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ నరసింహ ఐపీఎస్ హాజరై పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం (సలామీ) స్వీకరించి పరేడ్‌ను పరిశీలించారు. పోలీస్ దర్బార్ నిర్వహణ పరేడ్ అనంతరం ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'పోలీస్ దర్బార్'లో పోలీసు సిబ్బంది విధి నిర్వహణకు సంబంధించిన సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని శ్రద్ధగా విన్న ఎస్పీ, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్రమశిక్షణ, ప్రజాసేవకు ప్రాధాన్యం ఈ సందర్భంగా...