మఠంపల్లి మండలంలో మరుగుదొడ్లపై ఇంటింటి సర్వే254 ఇళ్లను గుర్తింపు.. యాప్‌లో వివరాల నమోదు

శుభోదయ డైనమిక్ న్యూస్, మఠంపల్లి,జులై 4 మఠంపల్లి మండల కేంద్రంతో పాటు పెదవీడు, రఘునాథపాలెం, బహుమతులగూడెం తదితర గ్రామాల్లో శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇంటింటి మరుగుదొడ్లపై సర్వే నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను అంచనా వేసి, మరుగుదొడ్ల సౌకర్యం లేని ఇళ్ల వివరాలను సేకరించారు. 80 శాతం ఇళ్లలో మరుగుదొడ్లు లేవు మఠంపల్లి ఎస్సీ కాలనీలో సర్వే నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గ్రామంలో మొత్తం 254 ఇళ్లను గుర్తించగా, తొలి దశలో 50 ఇళ్లలో సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. సర్వేలో సుమారు 80 శాతం ఇళ్లలో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోయినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. యాప్‌లో నమోదు.....