అమ్మ పేరుతో మొక్క నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి 'ఏక్ పెడ్ మా కే నామ్ – సోయింగ్ టు గ్రోయింగ్ 2026' వాల్ పోస్టర్ ఆవిష్కరణ
సూర్యాపేట బ్యూరో , జూలై 6,శుభోదయ డైనమిక్ వార్త పర్యావరణ పరిరక్షణ, హరితహారం విస్తరణ, విద్యార్థుల్లో ప్రకృతి పట్ల బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ (ఎన్‌జీసీ), జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న "ఏక్ పెడ్ మా కే నామ్ (అమ్మ పేరుతో మొక్కను నాటడం) – సోయింగ్ టు గ్రోయింగ్ 2026" జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం ఆవిష్కరించారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను సంరక్షించాలి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి, దానిని...