మునగాల పోలీస్ స్టేషన్‌పై ఎస్పీ నరసింహ ఆకస్మిక తనిఖీ ప్రజలకు అందుబాటులో పోలీస్ – బాధితులకు భరోసా కల్పించాలన్న ఎస్పీ
మునగాల, జూలై 7, శుభోదయ డైనమిక్ వార్త సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం మునగాల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీసు సేవలు, విధుల నిర్వహణ, స్టేషన్ పరిపాలనపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు బాధితులకు భరోసా కల్పించేలా పనిచేయాలని పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. రిసెప్షన్ సెంటర్ సేవలపై ప్రత్యేక దృష్టి తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ, ఫిర్యాదుల స్వీకరణ, నమోదు, బాధితులతో సిబ్బంది వ్యవహరించే తీరు, కేసుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడికి నమ్మకం కలిగేలా మర్యాదపూర్వకంగా స్పందించాలని సిబ్బందికి సూచించారు. రికార్డులు,...