గామాలపాడులో భక్తి వెల్లువ శ్రీ మల్లికార్జున స్వామి తొమ్మిది రోజుల ఉత్సవాలకు ఘన ముగింపు ప్రత్యేక పూజలు, హోమాలు, మహా అన్నదానంతో ఆధ్యాత్మిక శోభ

దాచేపల్లి, జూలై 12,శుభోదయ డైనమిక్ వార్త పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలోని చారిత్రక శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించిన ఆధ్యాత్మిక ఉత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ నెల 4వ తేదీన జరిగిన పునఃప్రతిష్ఠ మహోత్సవం అనంతరం ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగా, చివరి రోజు భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు ఉత్సవాల ముగింపు సందర్భంగా వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం నిర్వహించిన...