మహిళల భద్రతకు 'పోలీస్ అక్క' భరోసా బాలికలు, మహిళలు తమ సమస్యలను నిర్భయంగా పోలీస్ అక్కతో పంచుకోవాలి: అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి

సూర్యాపేట బ్యూరో , జూలై 15 శుభోదయ డైనమిక్ వార్త మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వేధింపులు, వ్యక్తిగత, సామాజిక సమస్యలను నిర్భయంగా పోలీస్ అక్కకు తెలియజేయవచ్చని, వారికి చట్టపరమైన సహాయం అందించి అండగా నిలవడమే రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిన 'పోలీస్ అక్క' కార్యక్రమం ప్రధాన లక్ష్యమని సూర్యాపేట జిల్లా అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ గురుకుల బాలికల విద్యాలయంలో అవగాహన కార్యక్రమం పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం సూర్యాపేట రూరల్ పోలీసులు, జిల్లా షీ టీం ఆధ్వర్యంలో మండల పరిధిలోని బాలెంల గ్రామ సమీపంలోని తెలంగాణ గురుకుల బాలికల విద్యాలయంలో 'పోలీస్ అక్క' అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి...