నకిరేకల్ పోలీస్ స్టేషన్‌పై జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ రికార్డుల పరిశీలన – నేర నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారంపై అధికారులకు కీలక ఆదేశాలు
నల్లగొండ బ్యూరో, శుభోదయ డైనమిక్ వార్త, జులై 15 నల్గొండ జిల్లా నకిరేకల్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల స్థితి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది హాజరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేయాలి స్టేషన్‌లో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించిన ఎస్పీ, పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దర్యాప్తు ప్రక్రియలో నాణ్యతతో పాటు వేగానికి కూడా ప్రాధాన్యం...