నేరేడుచర్లలో మెడికల్ షాపుల ఇష్టారాజ్యం..!నిబంధనలు గాలికొదిలి మందుల విక్రయాలు – తనిఖీల్లో అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం ఫార్మసిస్ట్ లేకుండానే మందుల విక్రయాలు?ఫార్మసిస్ట్ లేకుండానే మందుల విక్రయాలు?

నేరేడు చర్ల, శుభోదయ డైనమిక్ వార్త, జులై 22 సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో మెడికల్ షాపుల నిర్వహణపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ఫార్మసిస్ట్ సమక్షంలోనే మందులు విక్రయించాల్సి ఉండగా, అనేక మెడికల్ షాపుల్లో ఫార్మసిస్ట్ కనిపించకుండా మందుల విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన కీలకమైన ఈ అంశాన్ని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. షాపుల కొలతల నిబంధనలు బేఖాతరు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెడికల్ షాపులకు నిర్దిష్ట కొలతలు ఉండాల్సి ఉన్నప్పటికీ, నేరేడుచర్లలో చాలా షాపులు ఆ ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఆరోపణలు ఉన్నాయి. అవసరమైన విస్తీర్ణం లేకుండానే అనుమతులు...