డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలఆగస్టు 7 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు అవకాశం

హుజూర్‌నగర్, జూలై 26, శుభోదయ డైనమిక్ వార్త డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఆగస్టు 7, 2026లోపు ఫీజు చెల్లించాలని యూనివర్సిటీ తెలిపింది. డిగ్రీ కోర్సులు యూనివర్సిటీలో బి.ఏ., బి.కాం., బి.ఎస్‌సీ. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. అలాగే పీజీ స్థాయిలో ఎం.ఏ. (తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, సమాజ శాస్త్రం, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్), ఎం.కాం., ఎం.ఎస్‌సీ. వివిధ సబ్జెక్టుల్లో అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా బి.లైబ్రరీ...