నేరేడుచర్ల మండల తొలి సమీక్షా సమావేశం ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తం కావాలి – ప్రత్యామ్నాయ పంటలే రైతులకు రక్షణ VDG RAMG జలసిరి పనులు వేగవంతం చేయాలి – ప్రత్యేక అధికారి వి. మోహన్‌బాబు
నేరేడుచర్ల, శుభోదయ డైనమిక్ వార్త,జూలై 28 డ్రిప్ సిస్టమ్‌కు 90 శాతం సబ్సిడీ.. రైతులు వినియోగించుకోవాలి: వ్యవసాయ అధికారి జావేద్ నేరేడుచర్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల తొలి సమీక్షా సమావేశం ప్రత్యేక అధికారి వి. మోహన్‌బాబు అధ్యక్షతన నిర్వహించారు. మండలంలోని వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరై శాఖల వారీగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి వి. మోహన్‌బాబు మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా VDG RAMG జలసిరి...