e-KYC పూర్తి చేయని వారి గ్యాస్ బుకింగ్ రద్దు!ఆగస్టు 16 వరకు గడువు ఉన్నా పంపిణీపై ప్రభావం

నడిగూడెం, శుభోదయ డైనమిక్ వార్త,ఆగస్టు 3 వంటగ్యాస్ సిలిండర్ల e-KYC ప్రక్రియపై వినియోగదారుల్లో గందరగోళం నెలకొంది. అధికారికంగా ఆగస్టు 16 వరకు గడువు ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ఆగస్టు 1 నుంచే e-KYC పూర్తి చేయని వినియోగదారుల గ్యాస్ బుకింగ్‌లను రద్దు చేస్తూ సిలిండర్ల పంపిణీని నిలిపివేస్తున్నట్లు డిస్ట్రిబ్యూటర్లు వెల్లడిస్తున్నారు. దీంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే e-KYC పూర్తి చేసిన వారికి ఆందోళన అవసరం లేదు ఇప్పటికే e-KYC పూర్తి చేసిన వినియోగదారులు మళ్లీ ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్పష్టం చేశాయి. కేవలం పెండింగ్‌లో ఉన్నవారు మాత్రమే e-KYC పూర్తి చేయాలని సూచించాయి....