హరీశ్ రావుపై వ్యక్తిగత వ్యాఖ్యలు తగవు: మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతును అణిచివేయాలనే ప్రయత్నం జరుగుతోందని విమర్శ
సిద్దిపేట జిల్లా, గజ్వేల్, ఆగస్టు 4 ,శుభోదయ డైనమిక్ వార్త హరీశ్ రావుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యక్తిగత వ్యాఖ్యలు అవివేకపూరితమైనవని గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నించే నాయకుడిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కట్టడి చేయాలని భావించడం కాంగ్రెస్ నాయకుల మూర్ఖత్వానికి నిదర్శనమని ఆయన అన్నారు. గుడికి వెళ్లడం రాజ్యాంగ హక్కు గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకోవడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని మాదాసు శ్రీనివాస్ పేర్కొన్నారు. తమ విశ్వాసానికి అనుగుణంగా హరీశ్ రావు దేవాలయానికి వెళ్లడాన్ని రాజకీయ వివాదంగా మార్చి, క్షుద్రపూజలు చేశారంటూ వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్...