జయశంకర్ ఆశయాలే తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శకం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్, గద్దర్‌కు ఘన నివాళులు

నల్గొండ బ్యూరో , ఆగస్టు 6,శుభోదయ డైనమిక్ వార్త తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జీవితాంతం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా నిలిచిన జయశంకర్ విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లో నింపి, రాష్ట్ర సాధనకు విశేష కృషి చేశారని కొనియాడారు.ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా గురువారం నల్గొండలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అదే సందర్భంగా ప్రజాకవి గద్దర్ వర్ధంతిని...