జైల్‌ భరోకు బయలుదేరుతున్న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అరెస్టు

సూర్యాపేట, శుభోదయ డైనమిక్ వార్త, ఆగస్టు 10 కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం నిర్వహిస్తున్న జైల్‌ భరో కార్యక్రమానికి బయలుదేరిన సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేటలోని తన నివాసం నుంచి జైల్‌ భరో కార్యక్రమానికి బయలుదేరుతున్న సమయంలో పోలీసులు ఆయనను అరెస్టు చేసినట్లు సీపీఐ(ఎం) జిల్లా కమిటీ తెలిపింది. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ పేర్కొంది. శాంతియుతంగా నిర్వహించే జైల్‌ భరో కార్యక్రమాన్ని అడ్డుకోవడం, ప్రజా...